ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 6:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బాపూ ఘాట్‌లో డిజిటల్ మ్యూజియంను గవర్నర్ తో కలిసి ప్రారంభించిన ముఖ్యమంత్రి

అర్జున్ సమాచారం:                                                                                                                          జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూ ఘాట్‌లో రాష్ట్ర గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా తో కలిసి ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాపూ ఘాట్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్ తో కలిసి ముఖ్యమంత్రి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డిరు, మహమ్మద్ అజారుద్దీన్ , ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి  పాల్గొన్నారు.

అలాగే, ప్రభుత్వ సలహాదారులు వీ హనుమంత రావు , హర్కర వేణుగోపాల్ , ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్ , రామచంద్ర నాయక్  ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , డీజీపీ సీవీ ఆనంద్ , ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
================